తత్వ చింతన
సీ.హారకేయూరాది-యాభరణంబులు వేరుగా ననిపించు - వేరు గావు నశియించెడివి రూప- నామంబు లగువేరు మారనట్టి కనక - మవదు వేరు అలలు బుద్బుదఫేన - లగుపించు వేరుగ ఆధారమగు నీర - మవదు వేరు నీరుబంగారముల్ - తీరుగ సత్యమె అనయమౌ బ్రహ్మము - కసలు రూపు తే.రూపనామముల్ జగతికి - రూపమగును భాతి యస్థి ప్రియములె యా - బ్రహ్మ రూపు నామరూపములనువీడి - నపుడు మనమె అద్వితీయమౌ బ్రహ్మము- నరయ గలము ...కోట శర్మ వివరణ: గొలుసు, గాజులు వంటి ఆభరణములు వేరు వేరు గా కనిపించినను అవి కేవలము నామ రూపములు గానే భిన్నములు. వాటికి ఉపాదానకారణమైన బంగారమే వాటి అసలు రూపము. బంగారముగా అవి అభిన్నములు. నామరూపములు త్యజించి చూడగా అవన్నీ ఒక్కటిగానే ( బంగారము గానే) గోచరిస్తాయి. బంగారము ఆ ఆభరణములు తయారు చేయకముందు, చేసిన తరువాత, అలాగే వాటిని కరిగించిన తరువాత కూడా ఉంటుంది. కాటట్టి బంగారము నిత్యము, సత్యము. కాని ఆభరణములు తయారుచేయటానికి ముందు లేవు. అలాగే వాటిని కరిగించాక ...