తాత చిప్ప తరతరాలు
కనిపెంచిన
తలిదండ్రులు
కనిపించెడి దేవతలుగ
అనిపించని అర్భకులకు...
వినిపించెద హితము కోరి
కనిపించెడి దేవతలుగ
అనిపించని అర్భకులకు...
వినిపించెద హితము కోరి
కనిపించని
దేవతలకు
వినుతించిన నేమొరగదు
నినుపెంచిన దేవతలే
సుఖియించని పక్షములో
వినుతించిన నేమొరగదు
నినుపెంచిన దేవతలే
సుఖియించని పక్షములో
చనుదెంచిన
పిదప నీవు
విలపించుట తగదుగాన
కలహించక, కలకాలము
అలరించుము అనురక్తితొ
విలపించుట తగదుగాన
కలహించక, కలకాలము
అలరించుము అనురక్తితొ
పరికించక
నామాటలు
తిలకించక
సత్యంబును
విరసించిన తలిదండ్రిని
విసిగించిన నీవారిని
వికటించును నీదు బతుకు
విరసించిన తలిదండ్రిని
విసిగించిన నీవారిని
వికటించును నీదు బతుకు
నువుపెంచిన
నీకొడుకే
తలపించును తలిదండ్రిని
తాతచిప్ప తరతరాలు
అనుచందము నిను చూడక
అసహించును చివరి వరకు
తలపించును తలిదండ్రిని
తాతచిప్ప తరతరాలు
అనుచందము నిను చూడక
అసహించును చివరి వరకు
సవరించుకొ
నీ మార్గము
కలిగించుము ఆనందము
మురిపించుతు కన్నోరిని
కరుణించును కమలాక్షుడు
కలిగించుము ఆనందము
మురిపించుతు కన్నోరిని
కరుణించును కమలాక్షుడు
Comments
Post a Comment