వేదమార్గము జ్ఞానమేనని వేయిసూక్తులు వ్రాసెడిన్
ఆదిలేనిది యంతులేనిది యంతటున్నది యొక్కటే
భేదభిన్నము లేనెలేదని భేరిగావిని పించెడిన్
ఆదిశంకర లోకమంగళ యార్షసద్గురవే నమో

తనువే తానుగ తలచెడి
మనసే కారణము జనన మరణమ్ములకున్
తనలో తలపులు నిలుపగ
మన మనసే ముక్తినిచ్చు మార్గము చూపున్

మెలకువ నిదురయు కలలను
      త్రిలోక ములలో మనుజుడు తిరుగును నిలలో
      మెళుకువతో లోకమ్ములు
      తిలకించగ విదితమగును తీరు తరింపన్

కం. మెలగును తనువును  మనసును
       మెలకువలో, మనసొకటియె మెదలును కలలో
       కలిపించి లేని జగతిని,
       కలలుకనని నిదురలోన కనబడ వేవీ!

 కం. మెలకువ లో కనబడునవి
       కలలో నుండవు, కలిగిన కల కనుమరుగౌ
       మెలకువలో, మాయమగు స
       కలము నిదురలో, సకలము కనునది నీవే

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్