కనిపెంచిన తలి దండ్రులు
       కనిపించెడి దేవతలుగ గ్రహియించు సుమీ!
       కనిపించని దేవతలను
       వినుతించిననేమొరగదు వీరే దూతల్!

కం. తిలకించక సత్యమ్మును,
       గలహించుచు, కష్టములను గలిగించినచో
       తలిదండ్రులు కలవరపడి
       విలపించిన నీదు బ్రతుకు వికటించు సుమా!

అల్లరి పిల్లల తల్లికి
నల్లట లెల్ల తనపిల్లలల్లరి వల్లన్!
పిల్లల కల్లలు తల్లికి
నల్లట, పిల్లలకువల్లదల్లరి యెల్లన్

తెలుగు భాష జనుల తెలివి తేటలు పెంచు
ధారణందు చిక్కు పూరణందు
నన్ని భాష లందు నవధానముండునా
తెలుగు పద్యమన్న తేనెలూరు

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్