గీతాకారుడి తో మొర
విన్నాడను నీ మాటలు
సన్నాయిలా వినిపించెను
కన్నాడను సత్యంబును
అన్నాడను వదలాలని (కోరికలు)
చిన్నాడను చీకటిలో
ఉన్నానని ఇపుడె తెలుసు
కున్నాడను.
అజ్ఞానిని మన్నించుమా
విన్నాణము నందిచుమా
అన్నన్నా!
ఎన్నెన్ని ప్రాసలు
మున్నెన్నడు లేనివి నీవన్ననె
దొర్లు నన్నా ఇన్నా అనెరుగక.
ఆగక నువ్వోపలేనన్నా నన్నాపమన్నా.
అయినా నేనన్నా నా చిన్న ప్రాస
కన్నా నీవిన్న విన్ననె మిన్నని.
మాయా పన్నాగము ఛిన్నాభిన్నం
సేయగ సన్నుతి చేసెద
కన్నయ్యకు నాకన్నయ్యకు.
నాదు డెందమున చిందిన
పద పొందికతో మహదానందము
పొందిక సందియములొందక
అందించెద నంద నందనునికి
వంద వందనములు.
.... కోట శర్మ
Comments
Post a Comment