సుధకు జన్మదిన శుభాకాంక్షలు
తోటకం
విజయాతనయా సుధనీవెకదా
సుకధాపఠనం శ్రవణం మననం
స్తుతిగా నుతిగా నువుచేసెకదా
అతిధీ బుధులందరినీ
రుచిగా
సుచిగా నువువండినవంటలతో
ముదమందెనుగా తలమానికమై
గమకం తెలుసూ కవనం తెలుసూ
లలితా స్తుతిలో సరిరారెవరూ
సుమతీ వ్రతకూ సుగుణా సుధకూ
వెలుగొందుసుధా సుఖశాంతులతో
మదిలో శివునీ తలచీ కొలచీ.
..... కోట శర్మ
Comments
Post a Comment