మాదక ద్రవ్యం బాధక ద్రవ్యం
లేదిక భవ్యం రాదిక సౌఖ్యం
వాడుకనైతే వాడిక నాశం
వాడక సతతం వీడు తక్షణం
వేడుక కాదది వీడక తప్పదు

గంజాయి చరస్ గుడుంబా కొకైన్
ఇంకేదైనన్ ఏపేరున్నన్
తాకకెప్పుడూ ఎంతజెప్పినన్
స్వప్నమునైనన్ ఆటలకైనన్
చిన్నలు పెద్దలు ఎవ్వరి నైనన్
అలవడినంతనె బానిస చేయున్

వేదనలిచ్చును మోదము కాదది
రోదనలేయిక జీవితమంతా
వాదనలెందుకు వేదముగావిను
కాదనుకుంటే ఆటనుకుంటే
జోలికి పోతే బానిస వౌదువు

జబ్బులువచ్చును డబ్బులు పోవును
జైలులు శిక్షలు తిప్పలు తప్పవు
ఊరక పోదది ఊరిని ముంచును
చూపును నీకది నరకపుటంచును

మత్తుపదార్ధం బొత్తిగ వ్యర్ధం
విత్తం చిత్తం వత్తిడి మొత్తం
సత్తువ నెత్తురు చిత్తై చత్తురు
అత్తరమిత్తఱి వీడుము మత్తును

నాశము సర్వం సేయును తథ్యం 
మాదక ద్రవ్యం బాధక ద్రవ్యం..కోట శర్మ
అత్తరమిత్తఱి = త్వరగా ఇప్పుడు

ఇత్తల = ఇవతల; అత్తల=అవతల;
ఇత్తఱి=ఇప్పుడు; అత్తఱి=అప్పుడు;
ఎత్తఱి=ఎప్పుడు; ఎత్తరతత్తరచేయు=ఉక్కిరిబిక్కిరి చేయు; సత్తెం=నిజం; అత్తరము=త్వరగా

...కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్