పేకాట
ఏకాలముంగనిన
నాకాలమందునను పేకాటలాడదగునే
పేకాటలోగెలిచి
నేకోటలేకొనుదు నాకేటిబెంగనుకొనిన్
పేకాటతోయఘులు
ప్రాకారమేనిలిపి ఏకాకిలాబ్రతుకుతూ
నాకారులైయిటుల
లోకాలనేమరచి పేకాటతోగడపగా
రాకాసిలానిలిచె
పేకాటనేయిలన పోకార్చుజూదరులనూ
చేకావలిన్
దులిపి చేకాసులూకడకు జూకాలనూవదలకన్
ఢోకాలతోనలిగి
చీకాకులేమిగులు పీకేయగానిలువునన్
రాకాలమందుగెలు
పేఖాయమైనటుల పోకళ్లుపోవలదురా
పోకాలమేకలిగి
ప్రాకాశమున్ దొలగి శోకాలలోముణుచురా
నాకేటికాదనుచు
నాకేమిపోదనుచు బేకారుమాటలిడిచీ
పేకాటపోవిడిచి
శోకాలనేకములు నాకేలకావుమనుచూ
లోకేశుకోరు,దహ రాకాశమందలిని రాకారునూగొలువురా
శోకాలువైదొలగు
శ్లోకాలతోదినము శ్రీకారమున్ పలుకరా!
Comments
Post a Comment