అమ్మా
ఆకలిలో శోకములో కోపములో అన్నిటిలో
అడుగడున అమ్మా అని అమ్మనే తలచుకొంటూ
అమ్మనుమించిన దైవం లేదని మరువనంటూ
అఖిలమ్ములో అమ్మలందరికీ
అనుదినము మాతలదినోత్సవము కావాలని
అనుక్షణం ఆనందము నిండాలని
నుతిస్తూ స్తుతిస్తూ అర్ధిస్తూ ప్రార్ధిస్తూ
జగన్మాతకు నతత్రాతకు
సవినయకరములజోత

...కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్