హాసప్రియుడు దరహాసవదనుడు 
ప్రాసప్రియుడు చిరు ప్రాయుడెపుడు
కష్టమైన గాని కాస్టింగు తో ఇచ్చె స్ఫూర్తి
ఇష్టమైన యాస్ట్రోను నిష్టగా జేసె పూర్తి
నిత్యసంతుష్టి కి నమ్మ లేని షష్టి పూర్తి
జాతకాలాయనకు కరతలామలకము
ఏలినాటీ శనికి ఏమీ లేదిక పని.
కష్టములు మరచేవు 
ప్రాసతో మాట్లాడ కాస్సేపు వాడ్రేవు
మా ఆప్తమిత్రువు అజాత శత్రువు
ఆదినారాయణ గారు నిత్య పారాయణతో
భావికాలములలో  భవ్యకీర్తులతోడ
భాగ్యములు ప్రఫుల్లమై
ఇల్లన ప్రఫుల్ల గారుండ
ఎల్లెడల ఉల్లము ప్రఫుల్ల మై
కనకదుర్గమ్మ కరుణా వీక్షణములు
అనుక్షణం వారి కుండాలని
సుఖ శాంతులతో ఆయురైశ్వర్యములతో
వారి పరివారముండాలని
మా కైవారము
వారికై వారం వారం ( మళ్లీ మళ్లీ )

కోట శర్మ & అనురాధ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్