రామభక్త హనుమ
తన రధమున రథి దాసరధి
యని కపివరుండెరుగక కాదు
అంతరంగమున నిరంతరముగ
ఎగిసే భక్తిభావ తరంగములు
తరుగకయే
తన రవరవమున రవించే
రాఘవ నామ రావము రక్షణగా,
ఇక్ష్వాకు ని
కరుణా కటాక్ష
వీక్షణమనుక్షణముండాలని,
ఆరాముని ఆత్మారాముని చేసి
తన హృదయారామమున
నిర్విరామముగ తలచే
హనుమకు, సీతారాములు
సుతరాము రామని మారాము
చేసి మది లో నిలచే.
వాయునందను డెందము
నందెందెందు జూచిన
కోదండుడు మహదానందుడుగ
ముందుండు....కోట శర్మ
Comments
Post a Comment