Saranu Durga! in Ataveladulu
దుర్గ యనిన సకల దుర్గతుల్ తొలగును
దుర్గ యనగ సకల దురిత హారి
దుర్గ యనగ సకల దుఃఖనివారిణి
కరుణ చూపు తల్లి కనక దుర్గ
కనకదుర్గ మల్లికార్జునులిద్దరు
అమ్మవారి తోడ నయ్య వారు
కొండ మీద మనకు నండగా నుండిరి
కరుణ చూపు తల్లి కనక దుర్గ
జయము జయము నీకు జగములకు జనని
జయము నిన్ను గొల్చు జనులకెపుడు
జయము ధర్మమునకు జననినీవుండగన్
కరుణ చూపు మమ్మ కనక దుర్గ
శరణు వేడు కొందు శ్రద్ధతో యమ్మను
చరణ పద్మములకు శిరము వాల్చి
హరణమౌను నిక్కమన్ని దురితములు
కరుణ చూపు తల్లి కనక దుర్గ
కోట్ల భక్త జనుల కోర్కెలు తీర్చంగ
నింద్ర కీల గిరిని యిల్లు చేసి
విజయ వాడ లోన వెలసెను దుర్గమ్మ
కరుణ చూపు తల్లి కనక దుర్గ
ఆది శక్తి దుర్గ యాద్యంత రహితము
నాది శక్తి! కొలిచి నంత నిన్ను
నాది లేని దుఃఖ మంతమౌ మెదలంట
కరుణ చూపు మమ్మ కనక దుర్గ
మాధవుండు ధర్మమాచరించగ నాడు
కనిన సంతసించి కనికరమున
కనక దుర్గ కనుక కనకవర్షమునిచ్చె
కరుణ చూపు తల్లి కనక దుర్గ
మాయ వలన కలుగు మనుగడ జగతికి
మాయ మసలు దేవి మహిమ వలన
మాయ మాయ మగును మాతయే కరుణించ
కరుణ చూపు తల్లి కనక దుర్గ
ఈశనముల నిచ్చు నైశ్వర్యదాయిని
సకలజనులకిచ్చు శరణు వేడ
సౌఖ్య సంపదలను సౌభాగ్యదాయిని
కరుణ చూపు తల్లి కనక దుర్గ
విజయ వాడ లోన విజయ కనక దుర్గ
వేడుకొనిన జనుల వెతలు బాపు
బంధనములు ప్రతి బంధకాలు తొలగు
కరుణ చూపు తల్లి కనక దుర్గ
కొండ మీద దుర్గ కొలువై యుండంగ
కొండ క్రింద పారు కృష్ణ వేణి
పాద సేవ చేయు పావన కృష్ణమ్మ
కరుణ చూపు తల్లి కనక దుర్గ
శక్తి తత్వమెరిగి సద్భక్తి తోసదా
నిత్య పూజ చేయ నియతి తోడ
కనక దుర్గ తల్లి కాపాడు సర్వదా
కరుణ చూపు తల్లి కనక దుర్గ
దుర్గ యనిన సకల దుర్గతుల్ తొలగును
దుర్గ యనగ సకల దురిత హారి
దుర్గ యనగ సకల దుఃఖనివారిణి
కరుణ చూపు తల్లి కనక దుర్గ
కనకదుర్గ మల్లికార్జునులిద్దరు
అమ్మవారి తోడ నయ్య వారు
కొండ మీద మనకు నండగా నుండిరి
కరుణ చూపు తల్లి కనక దుర్గ
జయము జయము నీకు జగములకు జనని
జయము నిన్ను గొల్చు జనులకెపుడు
జయము ధర్మమునకు జననినీవుండగన్
కరుణ చూపు మమ్మ కనక దుర్గ
శరణు వేడు కొందు శ్రద్ధతో యమ్మను
చరణ పద్మములకు శిరము వాల్చి
హరణమౌను నిక్కమన్ని దురితములు
కరుణ చూపు తల్లి కనక దుర్గ
కోట్ల భక్త జనుల కోర్కెలు తీర్చంగ
నింద్ర కీల గిరిని యిల్లు చేసి
విజయ వాడ లోన వెలసెను దుర్గమ్మ
కరుణ చూపు తల్లి కనక దుర్గ
ఆది శక్తి దుర్గ యాద్యంత రహితము
నాది శక్తి! కొలిచి నంత నిన్ను
నాది లేని దుఃఖ మంతమౌ మెదలంట
కరుణ చూపు మమ్మ కనక దుర్గ
మాధవుండు ధర్మమాచరించగ నాడు
కనిన సంతసించి కనికరమున
కనక దుర్గ కనుక కనకవర్షమునిచ్చె
కరుణ చూపు తల్లి కనక దుర్గ
మాయ వలన కలుగు మనుగడ జగతికి
మాయ మసలు దేవి మహిమ వలన
మాయ మాయ మగును మాతయే కరుణించ
కరుణ చూపు తల్లి కనక దుర్గ
ఈశనముల నిచ్చు నైశ్వర్యదాయిని
సకలజనులకిచ్చు శరణు వేడ
సౌఖ్య సంపదలను సౌభాగ్యదాయిని
కరుణ చూపు తల్లి కనక దుర్గ
విజయ వాడ లోన విజయ కనక దుర్గ
వేడుకొనిన జనుల వెతలు బాపు
బంధనములు ప్రతి బంధకాలు తొలగు
కరుణ చూపు తల్లి కనక దుర్గ
కొండ మీద దుర్గ కొలువై యుండంగ
కొండ క్రింద పారు కృష్ణ వేణి
పాద సేవ చేయు పావన కృష్ణమ్మ
కరుణ చూపు తల్లి కనక దుర్గ
శక్తి తత్వమెరిగి సద్భక్తి తోసదా
నిత్య పూజ చేయ నియతి తోడ
కనక దుర్గ తల్లి కాపాడు సర్వదా
కరుణ చూపు తల్లి కనక దుర్గ
Comments
Post a Comment