ఉ.
కర్మల నాచరించుటకు కారణమా శివ శక్తి మాయయే
కర్మల బంధనమ్ములకు కారణమయ్యెను ధర్మ మూర్తియై
మర్మము తెల్పి సంచితము మాయము చేయును వేద వేద్యయై
శర్మము సత్తుచిత్తులుగ సర్వము తెల్పును ముక్తి దాతయై.. కోట శర్మ
కం
106.జననీయని జగదంబను
జనులందరు శరణువేడ సతతమ్మిలలో
కనిపించని పరతత్వమె
కనపించెడి దుర్గ మాతగాదిగి వచ్చెన్
107.అమ్మలకమ్మగ నిన్నే
నమ్మితి నమ్మా మనమున నామస్మరణ
మ్మిమ్ముగ చేసెద జ్ఞానము
నిమ్మని కోరుచు ననయము నిన్నే జననీ
108. తవచరణము మమ శరణము
భవతీ నీకరుణకోరి భవహరణముకై
సవినయముగ వినుతించెద
శివశంకరి విజయవాడ శ్రీదుర్గమ్మా!

Comments
Post a Comment