కం.
త్రినయన! మునిజన వినుతా!
అనఘా! శమన దమన! మదనాంతక! పంచా
 నన! నయనాయుధ! నను గన
 మననము చేసెద ననయము మనమున నిన్నే

కం.
సాంబ! శుభంకర! శంకర!
అంబాపతి! అంబరీష! అంతకహంతా!
త్ర్యంబక! కల్మషకంఠ! ది
 గంబర! శంభో! పురాంతకా!వందనముల్..

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్