గణముల కాధిపత్యమునకై తలిదండ్రుల గొల్చి యుక్తితో
గణపతు డయ్యె; దంతమును ఘంటము జేసి రచించె భారత
మ్మును హరకేశవప్రియుడు; మూషిక వాహనుడైన పార్వతీ
తనయుడి గాధలందుగల తత్త్వము నెర్గుము తారకమ్మిదే!
వింత వింతలు వృత్తాంత మంతయున్ను
వింతరూపచింతనమున సంతతమ్ము
చెంతచేరినంత యనంత సంతసించు
నంతరాయములాసాంతమంతరించు
Comments
Post a Comment