అమ్మ

మునుపటి జనమల మునిజనసేవల 
ముడుపుగ కలిగెను జనని
రావమ్మ కు నందనుడుగ నందించుచు
వందనములనందించగ 
శర్మమింకేమి కావలెనీ జన్మలొ శర్మకు

పరిమోరింటోరిమి నలవడి
రామయ్యగారర్ధాంగిగ మొదలిడి
చివరకు  పూర్ణాంగిగ నిలబడి 
అమ్మ సీతారావమ్మ ఒడి
తడబడు అడుగుల మొదలిడి 
మా నడవడికకు మొదటిబడి

అమ్మలగన్నయమ్మ పాదపద్మములకు
అమ్మకు పదికాలమ్ముల పదిలమునిమ్మని 
రావమ్మనే జన్మజన్మలకమ్మగనిమ్మని 

మనమ్ముననిమ్ముగ వేడెదన్

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్