మునుపటి జనమల మునిజనసేవల
ముడుపుగ పొందితి జననిగ
సీతారావమ్మనందనుడైనందున
నందించుచు వందనములనందించగ
శర్మమింకేమి కావలెనీజన్మలొ శర్మకు
పరిమివారింట అపరిమిత ఓరిమి నలవడి
కోటసీతారామయ్యగారి అర్ధాంగిగ మొదలిడి
పెనిమిటికి కడపటికి పూర్ణాంగిగ నిలబడి
న మాయమ్మ సీతారావమ్మ ఒడి
తడబడు అడుగుల మొదలిడి
మా నడవడికకు మొదటిబడి
అమ్మలగన్నయమ్మ పాదపద్మములకు
అమ్మ కు పదికాలముల పదిలమునిమ్మని
రావమ్మనే జన్మజన్మలకమ్మగనిమ్మని
మనమ్ముననిమ్ముగ వేడెదన్

Comments
Post a Comment