శా. నేనే నేను విముక్తవిజ్ఞుడను నేనే నిర్విశేషాత్ముడన్
నేనే నేను వికారదూరుడను నేనే సచ్చిదానందుడన్
నేనే నేను నిరంజనాత్ముడను నేనే బ్రహ్మరూపాత్ముడన్
నేనే నేనవికల్పనిత్యుడను నేనే శుద్ధ చైతన్యుడన్.. కోట శర్మ

శ్రీ శంకరాచార్యకృత బ్రహ్మజ్ఞానావళీమాలా నుండి కొన్ని పద్యముల ఆధారముగా వ్రాసిన పద్యము.
భావము: నేను గుణక్రియాది సర్వవిశేషరహితమగు జ్ఞానస్వరూపుడను, దృశ్య పదార్ధములతో దేనితోను సంగము కలవాడను కాను, వికారదూరుడను. నేను సచ్చిదానందస్వరూపుడను. నేనే నిత్య శుద్ధ బ్రహ్మస్వరూపుడను. అహమేవాహం = నేను నేనే.

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్