తెరగులు రెండే జగతిన
ఎరిగినవి ఎరగనివి అవవేవీ బ్రహ్మన్
ఇరు తెరగులు అవి ఇవియని
ఎరుక పరచునదయినట్టి ఎరుకయె బ్రహ్మన్
....కోట శర్మ...
భావము
: ప్రపంచములో కొన్ని మనకు తెలిసినవి మిగిలినవన్ని తెలియనివి. కానీ బ్రహ్మము
తెలిసినదీ కాదు అలాగే తెలియనిది కూడా కాదు. ఈ రెంటి గురించి తెలియజెప్పేదే ( అంటే
ఇది తెలుసు అది తెలియదు అని ) జ్ఞానస్వరూపమైన బ్రహ్మము. అదే ఆత్మ స్వరూపము.
Comments
Post a Comment