సీ. అందాల జలపాత మావృతంబైయున్న
అత్యంత సుందరం బమెరిక భువి
ఆకాశ
హర్మ్యాలు ఆభరణంబైన
అచ్చెరు వందించు అమెరిక భువి
ఆహ్లాద
కరమైన ఆర్లాండ్మయామీల
ఆవాస పూబోణి అమెరిక భువి
అట్లాంట
కసినోల అర్ధరాత్రిప్రభ
ఆంధ్రాకు కలలిల్లు అమెరిక భువి
ఆవె.లాస్వె గాసు డిస్ని లాండుయు
టైంస్క్వేరు
దీవి ఒడ్లు భువన దివిని తలపు
ధరన విపణి వీథి ధరలను శాసించు
అమరిన అలి వేణి అమెరిక భువి
Comments
Post a Comment