కం. కనులకు రూపము కనబడు,
కనుల కదలికలు మనస్సు కనుగొను కనులై,
మనసున మెదిలెడి తలపుల
గను సాక్షిగ ఆత్మ, తనను గనలే రెవరున్.. కోట శర్మ

భావము/వివరణ: (దృక్ దృశ్య వివేకము)
తెలుసుకొనునది దృక్, తెలియబడునది దృశ్యము.
చూడబడు రూపము దృశ్యము, రూపమును చూచు కనులు దృక్. అనగా దృశ్యమాన ప్రపంచము దృశ్యము. దానిని తెలుసుకొను ఇంద్రియములు దృక్. ఆ ఇంద్రియములను మనసు గమనించును.
కావున ఇంద్రియములు దృశ్యము, మనసు దృక్.
ఉదా: కనులు తెరిచామా మూసుకున్నామా అని తెలుపునది మనసు.
మనో వికారములైన కోపము, ఈర్ష్య, ద్వేషము, సంతోషము, బాధ వంటిని గమనించునది సాక్షీభూతమైన ఆత్మ.
కావున మనసు దృశ్యము, ఆత్మ దృక్. అన్నిటిని తెలుసుకొను జ్ఞాన రూపమైన ఆత్మ దృక్ మాత్రమే. దృశ్యము కాదు.
(దృక్ దృశ్య వివేకము ( 1 ) :
రూపం దృశ్యం లోచనం దృక్ తద్దృశ్యం దృక్తు మానసమ్ ।
దృశ్యా ధీవృత్తయః సాక్షీ దృగేవ న తు దృశ్యతే )

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్