అను అను నామము అనినంతనే
అనవరతము అణకువతో అన్నపూర్ణ కు



అనుంగు అనుజ అని,
అనవధిక అనురక్తి తో చేయు వయోధిక సేవ
అనితరసాధ్యమయినా అనుసరణీయమే
కనుక కోటానుకోట్ల దీవెనలతో
అనుదినము చేయు అనుష్ఠాన బలంతో
అనుక్షణం అనిరుద్ధుడి అనుగ్రహం కలగాలని
అనుకొనుట అనుచితము కాదేమో అని
అనుకొంటూ అన్నమాటలు

....కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్