మ.కో:జ్ఞాన రూపిణి
శ్వేత ధారిణి నాభి జాతుని కంగనా
రాణి వందన మమ్మనాపద రాజమాలిక వేయగా
వాణి మోదము కోరి వ్రాసితి వాసిగా
చిరు పద్యముల్
నేనుపూనిన పద్యవాహిని నేర్పుతో కొన సాగనీ.
.......కోట శర్మ.....మత్త కోకిల
భక్తియందు సేవలందు భక్తకోటి కగ్రజా!
భక్తబంధు జ్ఞానసింధు పాపనాశ కారకా!
డెందమందు రామచంద్రు
డుండెనీకు సర్వదా
రామదూత అందుకో మదర్పితాభి వందనం
ఆర్తరక్ష వజ్రకాయ ఆంజనేయు డానమో
మారుతాత్మ జాయసూర్య మిత్రమారు తింభజే
వాయుపుత్ర వాయువేగ వానరేశ పాహిమాం
భూతవైరి శూరభూరి భీతిహారి రక్షమాం....కోట శర్మ


Comments
Post a Comment