Posts

ఈశావాశ్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్తు 1. సీసం పరమాత్మ తత్త్వమ్ము పరిపూర్ణమైనట్టి     దాద్యంతములులేనిదట్టియాత్మ ఆయాత్మనుండియే నావిర్భవించెనీ   నశ్వరంబగునట్టి విశ్వమంత నామరూపాదులే నాశమౌ జగతిలో    నాభాస జనితమ్ములాత్మలోన భ్రమవీడి జ్ఞానియై పరికించ విశ్వమే    పరిపూర్ణమైనట్టి బ్రహ్మమగును ఆటవెలది పూర్ణమీజగత్తు , పూర్ణమా బ్రహ్మము పూర్ణతత్త్వమందు పూర్ణముండు వేద్యమౌ జగత్తవిద్యతొలగినంత పూర్ణతత్త్వముగనె పూర్ణమందు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే || ఓం శాంతిః శాంతిః శాంతిః | భావము కనిపించని బ్రహ్మము పూర్ణమైనది ఈ దృశ్య ప్రపంచము పూర్ణమైనది అదృశ్యుడయిన పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య ప్రపంచం వెలువడింది .  దృశ్య జగత్తును పూర్ణ బ్రహ్మమునుండి   వేరు చేసినప్పటికినీ ఆయన పరిపూర్ణుడే .  సత్యమైన పరమాత్మ తత్వం పరిపూర్ణమైనది . ఆ పరమాత్మ నుండియే ఈ జగత్తంతా బయట ఉన్నట్లుగా తోచుచున్నది .  అనగా ఆ పరమాత్మ కన్నా జగత్తు వేరుగా ...